కడప కార్పొరేషన్/పులివెందుల : వైఎస్సార్ కడప జిల్లాలోని మూడు జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. బుధవారం ఆయన ఢిల్లీలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో రేణిగుంట– ముద్దనూరు(ఎన్‌హెచ్–716) రహదారి కోడూరు, రాజంపేట, కడప, కమలాపురం, యర్రగుంట్ల, చిలంకూరు వంటి ఇండస్ట్రియల్, కమర్షియల్ పట్టణాలను కలుపుతుందని, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు, భారతి, జువారీ, ఐసీఎల్ వంటి సిమెంట్ కంపెనీలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయన్నారు. ఈ రహదారిని 4 లేన్లుగా విస్తరించాలని కోరారు. అలాగే ఎన్‌హెచ్–716లో కడప ఇర్కానన్ సర్కిల్ నుంచి జేఎంజే సర్కిల్ వరకు ఉన్న రోడ్డను 4 లేన్లుగా మార్చాలని విన్నవించారు. కర్నూలు, అనంతపురం, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి అనేకమంది ప్రజలు ఈ రహదారిలో ప్రయాణిస్తూ ఉంటారన్నారు.
పెరిగిన వాహనాల రద్దీని దృష్టిని పెట్టుకొని వెంటనే నాలుగు లేన్ల రహదారిగా విస్తరించాలని కోరారు. కడప– రాణిపేట(ఎన్‌హెచ్–40)లో కడప కార్పొరేషన్‌న్ పరిధిలోని ఇర్కాన్‌సర్కిల్ నుంచి ఐటీఐ సర్కిల్ వరకు ఫుట్ పాత్ లను అభివృద్ధి చేయాలని, ఇంటర్ లాకింగ్ పేవర్ బ్లాక్స్‌తో పార్కింగ్, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ ఏర్పాటు వంటి పనులు చేపట్టి ప్రమాదాలను నివారించే చర్యలు చేపట్టాలని కోరారు. పై మూడు ప్రతిపాదనలపైన కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో వీటిపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికీ
వైఎస్ అవినాష్‌రెడ్డి వినతి


