బద్వేలు తెలుగుగంగ కాలనీకి చెందిన రోజువారీ కూలి దేవి స్పందిస్తూ, తాము రెక్కాడితే గానీ డొక్కాడనని, ఈ విపరీతమైన ధరల వల్ల కూరగాయలే కొనలేక చికెన్, మటన్ తిని ఏడాదైందని, ఇద్దరూ కష్టపడినా నెల గడవడం భారం కావడంతో ఏ పూటకు ఆ పూట బతుకు వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు; దేన్ని ముట్టుకున్నా ధరలు మండిపోతుండటంతో ఏ వస్తువూ కొనలేకపోతున్నామని, గతంలో నచ్చిన వంటకాలు చేసుకునేవాళ్లమని, కానీ ఇప్పుడు మార్కెట్‌లో ఏది తక్కువ రేటుకు దొరికితే దాన్నే తెచ్చుకుని తింటున్నామని, ఆదాయాలు లేక ఖర్చులు తగ్గించుకున్నామని కలసపాడుకు చెందిన గృహిణి మాలక్షుమ్మ వాపోగా, ఎన్నడూ లేని విధంగా ప్రతి వస్తువుపై ధరలు పెంచి నియంత్రించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని, తుఫాన్ ముందు ప్రశాంతతలా ప్రజలంతా నిశ్శబ్దంగా గమనిస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనం చూపించే నిరసన జ్వాలల పరాభవంతో ఈ ధరలే కూటమి ప్రభుత్వాన్ని కూల్చేస్తాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఉమ తీవ్రంగా హెచ్చరించారు.
దేవి మా లక్షుమ్మ ఏకుల రాజేశ్వరిరెడ్డి ఉమ


