– నిపుణులు
ఈ పుస్తకాల మోతపై ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మహబూబ్ అలీ స్పందిస్తూ లేత వయసులో ఎముకలు, వెన్నెముక ఎదుగుదల దశలో ఉన్నప్పుడు శరీర బరువులో 10 శాతానికి మించి బరువు మోస్తూ బస్సులు, మెట్లు ఎక్కడం వల్ల వెన్నుపూసపై విపరీతమైన ఒత్తిడి పడి చిన్న వయసులోనే నడుము, మెడ నొప్పులతో పాటు స్పాండిలైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని హెచ్చరించారు. దీనికి తోడు భారీ బ్యాగుల వల్ల శారీరక నొప్పులతో పాటు పిల్లల్లో తీవ్ర మానసిక ఒత్తిడి, అలసట, నిరాశ, చదువుపై విరక్తి చెంది ప్రతికూలంగా స్పందించే ప్రమాదం ఉందని ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ ఓ.వెంకటేశ్వరరెడ్డి స్పష్టం చేయగా, ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో కేవలం ప్రభుత్వ సిలబస్ పుస్తకాలనే అమలు చేస్తూ వారి సొంత మెటీరియల్స్, జేఈఈ, నీట్ పుస్తకాలను నిషేధించాలని, పాఠశాలల లోపల మెటీరియల్స్ అమ్మకుండా గట్టి చర్యలు తీసుకున్నప్పుడే పిల్లలపై పుస్తకాల భారం తగ్గుతుందని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పసుపులేటి సాయిదత్త డిమాండ్ చేశారు.


