కొనసాగుతున్న అండర్‌–19 క్రికెట్‌ మ్యాచ్‌లు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న అండర్‌–19 క్రికెట్‌ మ్యాచ్‌లు

Jul 13 2026 1:34 AM | Updated on Jul 13 2026 1:34 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–19 మల్టీ డే మ్యాచ్‌లు రెండో రోజు కొనసాగాయి.కెఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆదివారం 359 పరుగులతో ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 99.5 ఓవర్లలో 381 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. చిత్తూరు జట్టులోని తేజే్‌ష్‌ 5 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 73.5 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులోని ఎస్‌ఎంజి ప్రభాకర్‌ 73, జయంత్‌ 88 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని మల్లిఖార్జున 5 వికెట్లు తీశాడు. రిషికేశ్వర్‌ 2, మురారి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 5 ఓవర్లకు 1 వికెట్‌ కోల్పోయి 4 పరుగులు చేసింది దీంతో కర్నూలు జట్టు 142 పరుగుల ముందజలో ఉంది దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో...

అదే విధంగా వైఎస్‌ఆర్‌ఆర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రెండోరోజు 409 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జట్టు 96.4 ఓవర్లలో 440 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 53.1 ఓవర్లకు 154 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని లోకేష్‌ 45, గురు మోహన్‌రెడ్డి 25 పరుగులు చేశారు. కడప జట్టులోని ధీరజ్‌కుమార్‌ రెడ్డి వేసి 5 వికెట్లు తీశాడు. నాగకుళ్ళాయప్ప 3 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జట్టు 15 ఓవర్లకు వికెట్‌ నష్టపోకుండా 73 పరుగులు చేసింది. దీంతో కడప జట్టు 359 పరుగుల ముందజలో ఉంది. దీంతో రెండోరోజు ఆట ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement