ఈ ఫొటోలో వ్యక్తి పేరు పెనుకొండ రామశేషయ్య. ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటున్నాడు. వయసు 77 ఏళ్లు. లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. 2009 ఏప్రిల్ 15న గుండె పోటు వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా స్విమ్స్ ఆస్పత్రిలో గుండెకు స్టంట్ వేయించుకున్నారు. 2019లో మళ్లీ గుండె పోటు రావడంతో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్టంట్ వేయించుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలు తమ కుటుంబంలో వెలుగులు నింపారని రామశేషయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


