● గొంతెండిన.. గోస | - | Sakshi
Sakshi News home page

● గొంతెండిన.. గోస

Jul 7 2026 12:39 AM | Updated on Jul 7 2026 12:39 AM

చేతిలో రంగు రంగుల ప్లాస్టిక్‌ బిందెలు ఉన్నాయి.. కానీ వాటిల్లో గుక్కెడు తాగడానికి చుక్క నీరు లేదు! వాతావరణం అనుకూలించక ఎండలు మండిపోతున్న ఈ రోజుల్లో దాహార్తిని తీర్చాల్సిన ప్రభుత్వ కుళాయిలు పూర్తిగా ఎండమావులుగా మారడంతో.. సిద్దవటం మండలంలో సామాన్య దళిత కుటుంబాలు నీటి కోసం అల్లాడిపోతున్నాయి. మండల పరిధిలోని వంతాటిపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో పది రోజులుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో సోమవారం స్థానిక మహిళలు, యువకులు, వృద్ధులు ఖాళీ బిందెలను ప్రదర్శిస్తూ వీధుల్లోకి వచ్చి తమ నిరసనను, నిస్సహాయతను తెలియజేశారు.్ఙపది రోజులుగా కుళాయిల్లో చుక్క నీరు రావడం లేదు సామీ.. చిన్న పిల్లలను పట్టుకుని దాహంతో ఎలా బతకాలి?్ఙ అంటూ కాలనీ మహిళలు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో తాగునీరు రాకపోవడంతో నిత్యం వంట వండుకోవడానికి, తాగడానికి మైళ్ల దూరంలో ఉన్న పంట పొలాల్లోని వ్యవసాయ బోర్ల వద్దకు కాలినడకన వెళ్లి నీటిని మోసుకురావాల్సిన దుస్థితి దాపురించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోరమైన తాగునీటి సమస్యపై స్థానిక గ్రామ పంచాయతీ అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా.. కనీసం ట్యాంకర్ల ద్వారా కూడా ప్రత్యామ్నాయ నీటి సరఫరా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన తమ కాలనీకి తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. వీరి తాగునీటి సంక్షోభంపై శ్రీసాక్షిశ్రీ మండల విస్తరణాధికారి మెహతాబ్‌ యాస్మిన్‌ను వివరణ కోరగా.. సదరు కాలనీకి నీరందించే బోర్ల మోటారు హఠాత్తుగా రిపేరుకు గురైందని, అందుకే సరఫరా ఆగిపోయిందని తెలిపారు. రెండు రోజుల్లోనే పను లు పూర్తి చేసి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. – సిద్దవటం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement