కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 141 ఫిర్యాదులు పీజీఆర్‌ఎస్‌కు వచ్చాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వృద్ధులు దివ్యాంగుల వద్దకే జిల్లా ఎస్పీ వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. చట్ట పరిధిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అర్జీలను పరిశీలించిన ఎస్పీ పోలీస్ అధికారులతో ఫోనన్ లో మాట్లాడారు. నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డి. ఎస్పీ ఎన్. సుధాకర్, డి.టి.సి డి.ఎస్పీ అబ్దుల్ కరీం, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్


