బద్వేలు అర్బన్ : బద్వేలు – పోరుమామిళ్ల రహదారిలోని లక్ష్మీపాలెం సమీపంలో గల బద్వేలు పెద్ద చెరువులో సోమవారం నీట మునిగి ఉన్న ఓ గుర్తు తెలియని ద్విచక్ర వాహనాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే విషయాన్ని అర్బన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అర్బన్ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ ఓబులేసు స్థానిక యువకుల సహకారంతో చెరువులోకి దిగి ద్విచక్ర వాహనాన్ని బయటికి తీశారు. బైక్ ఆనవాళ్లను బట్టి చాలా రోజుల క్రితమే చెరువులో పడిపోయి ఉన్నట్లు అనుమానిస్తున్నారు.దీనికి సంబంధించిన ఛాసీస్ నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ నంబర్, యజమాని వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఎక్కడైనా దొంగిలించిన వాహనాన్ని ఆధారం లేకుండా చేసేదానికి ఇక్కడ పడేశారా లేక ఎవరైనా ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంతో సహా పడిపోయారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


