సిద్దవటం : సిద్దవటం హైలెవెల్ వంతెన వద్ద కొన్ని రోజులుగా రాత్రివేళ యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతోంది. వంతెనకు అతి సమీపంలోని పెన్నానదిలో ఇసుక తవ్వకాలు జరుగుతుండటంతో గోతులు పడుతున్నాయి. నిబంధనల మేరకు వంతెనకు వంద మీటర్ల దూరంలో తవ్వకాలు జరపకూడదు. కానీ ప్రతిరోజు ట్రాక్టర్‌యజమానులు ఇక్కడ ఇసుక తవ్వకాలు జరిపి కడపకు అక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
స్పందించని పోలీసు, రెవెన్యూశాఖలు
సిద్దవటం పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఇసుక అక్రమరవాణా జరుగుతోంది. పోలీసులు అప్పుడప్పుడు మాత్రమే అక్కడ ప్రాంతాలలోని ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుంటున్నారే తప్ప పూర్తిగా నివారణ చర్యలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమరవాణాను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని పలువురు పెదవి విరుస్తున్నారు. వంతెన సమీపంలో ఇసుక తవ్వకాలు జరపడం వల్ల భవిష్యత్తులో హైలెవెల్ వంతెనకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
పట్టించుకోని అధికారులు


