రైతుకు అండగా.. రుణాలు మెండుగా | - | Sakshi
Sakshi News home page

రైతుకు అండగా.. రుణాలు మెండుగా

Jul 6 2026 1:58 AM | Updated on Jul 6 2026 1:58 AM

రైతుకు అండగా.. రుణాలు మెండుగా

కడప అగ్రికల్చర్‌: జిల్లా రైతాంగానికి, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధితోపాటు ఇతర రుణాల మంజూరు విషయంలో అధికార యంత్రాంగం చొరవ చూపుతోంది. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతన్నలకు బ్యాంకులు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. పెరుగుతున్న పెట్టుబడి రుణాలకు అనుగుణంగా పంటలసాగును బట్టి రైతులకు రుణాలను అందించనున్నారు. రైతులకు అందించే పంటల రుణ పరపతిని ఈ ఏడాది పెంచుతూ స్కేల్‌ ఆఫ్‌ పైనాన్స్‌ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు పంట రుణ పరపతి పెరగనుంది. కాకపోతే ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా వర్షపాతం తక్కువగా నమోదు కానున్నటు తెలిసింది. దీంతో అనుకున్న మేర పంటలు సాగవుతాయా లేక సాగు తగ్గుతుందా అనే విషయంలో సందిగ్థత నెలకొంది

2026–27కు ఇవ్వనున్న రుణాల వివరాలు....

తాజాగా పెరిగిన రుణ పరిమితి మేరకు జిల్లాలో అన్ని రంగాలకు సంబంధించి 2026–27 అర్థిక సంవత్సరంలో రూ.30,610 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించారు.ఇందులో ప్రాధాన్యతా రంగానికి రూ. 23,744 కోట్లు, ప్రాధాన్యేతర రంగానికి రూ. 6867 కోట్లు కేటాయించారు. ఇందులో వ్యవసాయరంగానికి అత్యధికంగా రూ. రూ. 18816 కోట్లు కేటాయించారు. పంట రుణాలకు రూ. 11630 కోట్లుకాగా, వ్యవసాయ టర్మ్‌లోన్లకు రూ. 6,168 కోట్లు, అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలకు రూ. 952 కోట్లు, వ్యవసాయ మౌలిక వసతులకు రూ. 66 కోట్లు ప్రతిపాదించారు.

● వ్యవసాయేతర సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధికి రూ. 4088 కోట్లు కేటాయించారు. ఇందులో మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.2808, స్మార్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ. 1039 కోట్లు, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌కు రూ. 213 కోట్లు, ఆదర్స్‌కు రూ. 27 కోట్లు కేటాయించారు.

● విద్యా రుణాలకు రూ. 115 కోట్లు, గృహ రుణాలకు రూ. 220 కోట్లు, సామాజిక మౌలిక వసతులకు రూ. 10 కోట్లు, పునరుత్పాదక రంగానికి 46 కోట్లు, ఇతర ప్రాధాన్యతా బంగాలకు రూ. 447 కోట్లు కేటాయించారు.

● అగ్రికల్చర్‌(ఎన్‌పిఎస్‌) కింద రూ. 45 కోట్లు, ఎడ్యుకేషన్‌ (ఎన్‌పీఎస్‌) కింద రూ. 36 కోట్లు, హౌసింగ్‌ (ఎన్‌పీఎస్‌) కింద రూ. 610 కోట్లు, పర్సనల్‌ లోన్లు(ఎన్‌పిఎస్‌) 2126 కోట్లు, అదర్‌ ఎన్‌పీఎస్‌ కింద రూ. 420 కోట్లు ఇలా ఈ ఏడాది మొత్తంగా జిల్లాలోని అన్ని బ్యాంకుల పరిధిలో రూ. 30610 కోట్లు రుణాలను అందించడమే లక్ష్యంగా అధికారులు నిర్థారించారు.

2026–27 ఏడాదికి రుణ

ప్రమాణిక వివరాలు ఇలా....

రుణాలు ఏడాది టార్గెట్‌

(రూ.కోట్లలో)

వ్యవసాయం, అనుబంధాలకు 18816

పరిశ్రమలకు 4088

ఇతర రుణాలు 839

నాన్‌ ప్రియార్టి రుణాలు 6867

2020 నుంచి పంట రుణాల (రూ. కోట్లలో)

వివరాలు..

ఏడాది లక్ష్యం మంజూరు శాతం

2020–21 5500 5354 97

2021–22 6600 7729 117

2022–23 4541 4979 109

2023–24 6676 7171 107

2024–25 7003 8913 127

2025–26 8798 11639 132

2026–27 11630 – –

పంటలకు పెరిగిన రుణ పరపతి..

జిల్లా వార్షిక ప్రణాళిక ఆమోదం

బ్యాంకులకు చేరిన స్కేల్‌ ఆఫ్‌ పైనాన్స్‌ నివేదికలు

పంటలకు పెరిగిన రుణ పరపతి ఎకరాకు (రూ.లలో)

పంట పేరు 2025–26 2026–27

వరి 46000– 52000 52000– 55000

పత్తి 48000–55000 52000–57000

జొన్న 23500– 25000 25000– 27000

మొక్కజొన్న 45000– 47000 47000–49000

సజ్జలు 22000– 24000 24000– 36000

కందులు 24000– 29000 27000– 32000

మినుము 26000– 30000 27000–31000

పెసలు 22000– 24000 24000–27000

శనగ 34000– 37000 35000–38000

సన్‌ప్లవర్‌ 26000–30000 30000–32000

వేరుశనగ 38000– 41000 41000–44000

పసుపు 115000–125000 117000–130000

మామిడి 49000–55000 56000–67000

బొప్పాయి 110000–120000 120000–130000

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement