రేపు జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

రేపు జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ ఎంపికలు

Jul 6 2026 1:58 AM | Updated on Jul 6 2026 1:58 AM

మినీ లారీ బోల్తా బైక్‌, కారు ఢీకొని..

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: కడపలోని ప్రభుత్వ జూనియర్‌ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఈ నెల 7న జిల్లాస్థాయి జూనియర్‌ ఫుట్‌బాల్‌ బాల బాలికల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డేనియల్‌ ప్రదీప్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2011 జవరి 1 నుంచి 2012 డిసెంబర్‌ మధ్య జన్మించి ఉండాలన్నారు. ఎంపికలకు హాజరయ్యే వారు ఆధార్‌ కార్డు, జనన ధృవీకరణ పత్రం తీసుకురావాలన్నారు. జిల్లాస్థాయికి ఎంపికై న క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుదని ఆయన తెలిపారు.

పులివెందుల వాసికి

నంది అవార్డు

పులివెందుల రూరల్‌ : పులివెందులలోని బ్రాహ్మణపల్లి రోడ్డు శ్రీరామ హాలు సమీపంలో నివాసముంటున్న సువర్ణకు స్వర్ణ నంది అవార్డు లభించింది. ఆమె గత కొంతకాలంగా తన నివాసం వద్ద చెక్కభజనను విద్యార్థులు, మహిళలకు ఉచితంగా నేర్పిస్తోంది. ఆమె ప్రతిభను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో సినీ నటుడు ధనరాజ్‌, విమానం సినిమా దర్శకుడు శివప్రసాద్‌ల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

డ్రైవర్‌కు గాయాలు

సిద్దవటం : సిద్దవటం–బద్వేల్‌ ప్రధాన రహదారి అటవీ ప్రాంతంలో లారీ అదుపు తప్పి బోల్తాపడటంతో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వివరాలలోకి వెళ్లితే.. సిద్దవటం–బద్వేల్‌ ప్రధాన రహదారి అటవీ ప్రాంతంలోని సాహెబ్‌ బావి సమీపాన శనివారం రాత్రి కావలి నుంచి కడపకు వెళ్తున్న మినీ లారీ కల్వర్టు దగ్గర అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ రాజేష్‌కు గాయాలయ్యాయి. కడప నుంచి కావలిలో సూపర్‌–కె మార్కెట్‌ ఫ్యాన్సీ స్టోర్లకు నిత్యావసర వస్తువులు అందించి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై మండల ఎస్‌ఐ హారిక ఆధ్వర్యంలో పోలీసులు విచారిస్తున్నారు.

ఒంటిమిట్ట: కడప–చైన్నె జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒంటిమిట్ట ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు..రాజంపేట నుంచి కడప వైపు ఏపీ 39 ఎఫ్‌వై 5092 నంబర్‌ గల బైక్‌లో వెలుతున్న రాజంపేట కు చెందిన ఇమాంవలి(47), శ్రీరాం(32)లను మండలంలోని కొండమాచుపల్లి గ్రామానికి చెందిన మోహన్‌ ఏపీ 39 యుఏ 6772 నెంబర్‌ గల కారులో కొండమాచుపల్లి నుంచి రాజంపేట వైపు వెలుతుండగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌లోని ఇమాంవలి, శ్రీరాంలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement