సర్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి

Jul 6 2026 1:58 AM | Updated on Jul 6 2026 1:58 AM

– ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే అమరనాధరెడ్డి

సిద్దవటం : శ్రీసర్‌శ్రీ పట్ల వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధరెడ్డిలు సూచించారు. సిద్దవటం మండలంలోని మూలపల్లి గ్రామంలోని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు ఉపాసి వెంకటరమణారెడ్డి, జడ్పీటీసీ ఉపాసి శ్రీకాంత్‌రెడ్డి ఆదివారం నిర్వహించిన మాచుపల్లిలో వెలసిన సయ్యద్‌ షావలి దర్గా మొక్కుబడి కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానికసంస్థల ఎన్నికలకు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయాత్తం అవ్వాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు ఉపాసి వెంకటరమణారెడ్డి, జడ్పీటీసీ ఉపాసి శ్రీకాంత్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరిరెడ్డి, ఉప మండలాధ్యక్షులు నారపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ నీలకంఠారెడ్డి, వైసీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి పెంచలయ్య, రైతు విభాగం జిల్లా జనరల్‌ సెక్రటరీ పల్లె సుబ్బరామిరెడ్డి, యువ నాయకులు జ్యోతి శివారెడ్డి, జ్యోతి లక్ష్మీరెడ్డి, రాజంపేట నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు కెవి సుబ్బయ్య, రాజంపేట వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు బత్తల భక్తుడు, ఎంపీటీసీ చంద్రశేఖర్‌రెడ్డి, డేరంగుల శివయ్య, కోఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌ నూర్‌, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, నడివీధి సుధాకర్‌, కృష్ణచైతన్య, కుప్పం సుబ్బారెడ్డి, గోపాలస్వామి, మాచునూరు సుబ్బారెడ్డి, గోచి యల్లయ్యయాదవ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement