యువతకు సువర్ణావకాశం | - | Sakshi
Sakshi News home page

యువతకు సువర్ణావకాశం

Jul 5 2026 3:00 AM | Updated on Jul 5 2026 3:00 AM

కడప ఎడ్యుకేషన్‌: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ‘మై భారత్‌’ డిజిటల్‌ వేదిక ద్వారా, 2026 జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది యువతీ యువకులను నమోదు చేసే లక్ష్యంతో ప్రత్యేక ఇంటెన్సివ్‌ రిజిస్ట్రేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు కడప జిల్లా యువ అధికారి దీపక్‌ జేమ్స్‌ తెలిపారు. ఈ సందర్బంగా అయన మై భారత్‌ కార్యాలయం నందు శనివారం పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేదిక ద్వారా 15–29 ఏళ్ల లోపు యువత ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ, అనుభవాత్మక అభ్యాసం మరియు జాతీయ స్థాయి స్వచ్ఛంద సేవా అవకాశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను పొందవచ్చు. ఈ కార్యక్రమంలో కళాశాలలు, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ విభాగాలు క్రియాశీలకంగా పాల్గొని యువతను పెద్ద ఎత్తున రిజిస్టర్‌ చేయించాలని ఆయన పిలుపునిచ్చారు. httpr://mybharat.gov.in పోర్టల్‌లో లేదా మైబారత్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.

రామయ్యకు స్నపన తిరుమంజనం

ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్‌లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు మూల విరాట్‌కి పంచామృతాభిషేకం నిర్వహించి, టీటీడీ ఆలయ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షణ చేసి, గర్భాలయంలోని మూల విరాట్‌కి సమర్పించారు. పట్టువస్త్రాలను, బంగారు ఆభరణాలు మూల విరాట్‌కి తొడిగి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు.

మల్లయ్యకొండకు రూ.7.44 లక్షల హుండీ ఆదాయం

తంబళ్లపల్లి: తంబళ్లపల్లి మల్లయ్యకొండ స్వామి వారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా రూ.7.44,790 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఏఓ మునిరాజ తెలిపారు. ఫిబ్రవరి 18 నుంచి శనివారం వరకు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్‌ కొండ కిట్ట, కూటమి నాయకులు పాల్గొన్నారు

తగ్గిన టమాట ధర

సాక్షి, మదనపల్లె: మదనపల్లె మార్కెట్‌లో టమాట ధరలు తగ్గాయి. శనివారం అత్యధిక ధర కిలో రూ.15, అతి తక్కువ ధర కిలో రూ.9 పలికింది. మార్కెట్‌కు విక్రయానికి అత్యధికంగా 1,530 టన్నుల టమాట వచ్చింది. కాగా ధరలు తగ్గుదలపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సీజన్‌ ముగింపు దశలో ఉండగా ధర తగ్గింది. అయితే విక్రయానికి వచ్చిన టమాట అధికంగా ఉండటం విశేషం. దీన్నిబట్టి చూస్తే టమాట దిగుబడులు ఇంకా భారీగా వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటిదాక మార్కెట్‌కు వచ్చిన అత్యధిక టమాట గత ఆదివారం 1,630 టన్నులు వచ్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement