టీడీపీ, జనసేన నేతలవి బూతు మాటలు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ, జనసేన నేతలవి బూతు మాటలు

Jul 5 2026 3:00 AM | Updated on Jul 5 2026 3:00 AM

ప్రొద్దుటూరు : సభ్యసమాజం తలదించుకునేలా టీడీపీ, జనసేన పార్టీల నేతలు మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన శనివారం తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌తోపాటు మంత్రులు పార్టీ నేతలందరిదీ ఇదే తీరుగా ఉందన్నారు. రెండు రోజుల క్రితం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పుతో కొడతానని మాట్లాడటం దేనికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ సభలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ మీ అమ్మ మొగుడు ఇచ్చాడా, మీ నాన్న మొగుడు ఇచ్చాడా, మీ నానమ్మ మొగుడు ఇచ్చాడా అని మాట్లాడటం సరైనది కాదన్నారు. పవన్‌కళ్యాణ్‌ తమను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ నాకొడకల్లారా చెప్పుతో కొడతానని వేదికపై చెప్పులు కూడా చూపించారన్నారు. ఈ సందర్భంగా రాచమల్లు స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు, మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి నారా లోకేష్‌ మాట్లాడిన మాటలను వీడియో ద్వారా ప్రదర్శించారు. టీడీపీ నాయకుడు ఆర్పీ మాజీ మంత్రిని రోజాను ఉద్దేశించి మాట్లాడుతూ రోజా కొవ్వును తిరుపతి లడ్డులో కలిపారని వ్యంగ్యంగా మాట్లాడటం దేనికి నిదర్శనమన్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ముస్లిం మహిళ గురించి చేసిన విమర్శలపై ముస్లింలందరూ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ప్రతినిధి అయి ఉండి ఇంతటి నిస్సిగ్గుగా ఎలా మాట్లాడగలిగారన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి అసభ్యకరంగా బూతు పదాలు మాట్లాడారన్నారు. సినీ నటుడు పృధ్వీరాజ్‌ మహిళల గురించి వ్యంగ్యంగా మాట్లాడారన్నారు.

పులిపర్తి నానిపై చర్యలు తీసుకోవాలి

చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలని రాచమల్లు శివప్రసాదరెడ్డి డిమాండ్‌ చేశారు. రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన రూ.40కోట్లు విలువైన 3.17 ఎకరాల భూమిని పులిపర్తి నాని కబ్జా చేశారన్నారు. దీనికి స్థానిక వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మద్దతు తెలపగా ఆయనను కూడా ఎమ్మెల్యే దూషించారన్నారు. గత రెండేళ్ల పాలనలో టీడీపీ, జనసేన నాయకులు ఏ వేదికను ఎక్కినా బూతు మాటలు, రోత పనులు చేయడం ఆనవాయితీ అయిందన్నారు. భావితరాల పిల్లలకు ఇవ్వాల్సింది ఇలాంటి సందేశమేనా అని రాచమల్లు ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

రాచమల్లు శివప్రసాదరెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement