జమ్మలమడుగు : ‘నీవు అధికార పక్షం .. నేను ప్రతిపక్షం.. రా.. జమ్మలమడుగు పాత బస్టాండ్‌లోని గాంధీ విగ్రహం దగ్గర చూసుకుందాం.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు’ అని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సున్నపురాళ్లపల్లె గ్రామంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆది చేసిన విమర్శలకు ఎమ్మెల్సీ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రానికి పట్టిన దరిఽద్రుడు ఎవరైనా ఉన్నారంటే ఆది నీవే అని తెలుసుకో’ అన్నారు. ‘నియోజకవర్గంలో దేవగుడి రాజ్యాంగాన్ని అమలు చూస్తూ బాబాయ్ అబ్బాయ్‌లు దండుకుంటున్నారని, అదిసరిపోక క్లబ్బులు.. బెల్టుషాపులు నడిపిస్తున్నారు. అలాంటి నీ బతుక్కి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి ఉందా’ అని ప్రశ్నించారు. ‘గంజాయి, డ్రగ్స్ తీసుకుని నీ కొడుకు మూడు సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. సొంత నీ కుమారుడిని సరిదిద్దుకోలేని నీవు దరిద్రుడివి’ అని తెలుసుకో అన్నారు. పులివెందులలో గతంలో సినిమా చూపించాను.. మళ్లీ చూపిస్తాను అంటావా.. పోలీసులను అడ్డుపెట్టుకోకుండా పులివెందులలో అడుగుపెట్టే ధైర్యం కూడా లేదు నీకు.. అక్కడి ఓటర్లతో కాకుండా జమ్మలమడుగు నుంచి ఓటర్లను తీసుకునిపోయి వారితో ఓట్లు వేయించి గొప్పగా చెప్పుకుంటున్నావు.. దీనికి నీవు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గుర్తుపెట్టుకో’ అని హెచ్చరించారు. ప్రజలు కూడా గమనించాలని, జమ్మలమడుగు నియోజకవర్గంలో అక్రమాలు చేస్తూ దోపిడీలకు పాల్పడుతూ అనకొండలాగా పెరిగిపోతున్న దేవగుడి కుటుంబాన్ని నాలుగు సార్లు గెలిపించారని.. ఇకపై మీరు గెలిపిస్తే ఆ అనకొండలు మిమ్మల్ని కూడా వదలవని, అప్పుడు తాము కూడా ఏమీ చేయలేని పరిస్థితి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈసీ సభ్యుడు గిరిధర్‌రెడ్డి, అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్‌రెడ్డి, బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి లక్షుమయ్య, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఆదికి ఎమ్మెల్సీ
పి.రామసుబ్బారెడ్డి వార్నింగ్


