ఆదీ.. నువ్వసలు మనిషివేనా? | - | Sakshi
Sakshi News home page

ఆదీ.. నువ్వసలు మనిషివేనా?

Jul 5 2026 3:00 AM | Updated on Jul 5 2026 3:00 AM

అధికారం ఉంటేనే నువ్వు ఆదినారాయణరెడ్డి.. లేకపోతే నిక్కర్‌ నారాయణవే

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మండిపాటు

కడప కార్పొరేషన్‌ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జంతువుతో పోల్చి అవమానిస్తావా.. ఆదినారాయణరెడ్డీ.. నువ్వసలు మనిషివేనా.. అంటూ కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం తన వివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. ‘లెక్చరర్‌గా పని చేశావే ఆ మాత్రం సంస్కారం లేదా.. వైఎస్‌ఆర్‌ పెట్టిన భిక్షతో రాజకీయంగా ఎదిగావని మర్చిపోయావా’ అని ప్రశ్నించారు. ‘గతంలో శివారెడ్డికి భయపడి హైదరాబాద్‌ నుంచి గుండ్లకుంట మీదుగా పోవాలంటే చుట్టూ తిరిగిపోయేవాడివి.. అప్పట్లో వైఎస్‌ఆర్‌ మీకు బండ్లు కొనిచ్చి అన్ని విధాలుగా అండగా నిలిస్తే గతాన్ని మర్చిపోయి ఆ కుటుంబాన్నే దూషిస్తున్నావు, ఆయన విగ్రహాన్ని కూలదోశావు.. ఇది నీ రాజకీయ పతనానికి నాంది’ అని హెచ్చరించారు. ‘అధికారముంటేనే నీవు ఆది నారాయణరెడ్డి.. లేకపోతే నిక్కర్‌ నారాయణవు మాత్రమే’ అంటూ ఎద్దేవా చేశారు. ‘వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఎవరినీ వేధించే ఉద్దేశం లేదు.. నిన్ను ఎక్కువగా కూడా ఊహించుకోలేదు.. అందుకే నన్నేం పీకలేకపోయారని విర్రవీగుతున్నావ్‌.. నీవు మాట్లాడే ప్రతి మాటకు భవిష్యత్‌లో సమాధానం చెబుతామని’ హెచ్చరించారు. ‘రాబోయే రోజుల్లో మీ ఊర్లోనే నీవు ధ్వంసం చేసిన చోటనే వైఎస్సార్‌ విగ్రహాన్ని మళ్లీ ఎంతో ఘనంగా ప్రతిష్టిస్తామని, అప్పుడు నీవు ఏ దేశానికి, రాష్ట్రానికి పారిపోతావో పోవాలని’ సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement