పోలీస్‌ కుటుంబాలకు కారుణ్య నియామక ఉద్యోగాలు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ కుటుంబాలకు కారుణ్య నియామక ఉద్యోగాలు

Jul 5 2026 3:00 AM | Updated on Jul 5 2026 3:00 AM

కడప అర్బన్‌ : జిల్లాలో ఇటీవల కాలంలో మరణించిన పోలీస్‌ సిబ్బంది.. కుటుంబ సభ్యులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అందజేశారు. అనారోగ్యంతో మరణించిన డి.మల్లికార్జున (ఏఆర్‌ ఎస్‌ఐ) కుమార్తె డి.మల్లికకు, వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో మరణించిన ఎస్‌.సతీష్‌ కుమార్‌ రాజు(సివిల్‌ కానిస్టేబుల్‌) సతీమణి అఖిలభారతి, బి.ముకుందర(సివిల్‌ కానిస్టేబుల్‌) సతీమణి పి.భారతికి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌లుగా నూతనంగా ఉద్యోగం మంజూరు చేయగా జిల్లా ఎస్పీ నియామక ఉత్తర్వులు అందజేసి వారిని అభినందించారు. విధుల్లో తక్షణమే జాయిన్‌ అవ్వాలని, ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో డీపీఓ ఏఓ జి.సుజాత, సూపరింటెండెంట్‌ శ్రీనివాస నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement