సాక్షి ప్రతినిఽధి కడప : జమ్మలమడుగు నియోజకవర్గంలో సున్నపురాళ్లపల్లె వద్ద జేఎస్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో చేపట్టిన స్టీల్‌ప్లాంటు ప్రారంభోత్సవం నేడు జరిగింది కాదని....అంతకుముందే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది ప్రారంభోత్సం కాదని..పునః ప్రారంభోత్సవమని ఎద్దేవా చేశారు. రాయలసీమలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు మొగ్గుచూపిన జిందాల్ సంస్థకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉక్కు పరిశ్రమకు తొలి అడుగుపడిందని, భూముల కేటాయింపు, నీటి కేటాయింపు, పర్యావరణ అనుమతులు, విద్యుత్, రోడ్డు కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలన్నీ అప్పుడే పూర్తి చేశారన్నారు. 2019 డిసెంబరులో స్టీల్ ప్లాంటును ప్రారంభించినప్పటికీ కరోనా వల్ల 2023లో స్టీల్ ప్లాంటు పనులు రూ. 1000 కోట్లతో శరవేగంగా జరిగాయన్నారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 25 నెలలు ఈ పనులు ఎందుకు ఆపారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, మంత్రులపై ఉందన్నారు. స్టీల్ ప్లాంటు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరమన్నారు.
‘ఆది’ మాటలు సంస్కారహీనం
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. ఆదినారాయణరెడ్డి బుద్ధి దరిద్రపు, వంకర బుద్ధి అని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ సింహంలా గర్జించేవాడని తెలిపారు. గజ్జికుక్కలాగా మొరిగేది ఆదినారాయణరెడ్డేనని విమర్శించారు. రాయలసీమ ప్రజలను వైఎస్ కుటుంబం కన్నబిడ్డల్లాగా భావిస్తుందని, అది ఇక్కడి ప్రజలందరికీ బాగా తెలుసన్నారు. కరువు రక్కసితో అల్లాడుతున్న రాయలసీమపై చంద్రబాబు సవతితల్లి ప్రేమ చూపిస్తారని, జగన్ మాత్రమే సొంత బిడ్డలాగా చూసుకుంటాడన్నారు. 2018లో కంబాలదిన్నెలో స్టీల్‌ప్లాంటు ప్రారంభోత్సవం సందర్బంగా ఏడాదిలోపు పనులను పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పారని, ఇంతవరకు పనులు పూర్తి కాలేదన్నారు. నేడు కన్యతీర్థంలో రూ. వెయ్యి కోట్లతో వైఎస్ జగన్ అభివృద్ది చేసిన స్టీల్ ప్లాంటుకు చంద్రబాబు పునః ప్రారంభోత్సవం చేశారేతప్ప సొంతంగా చేసింది ఏమి లేదన్నారు.
రెండేళ్లుగా స్టీల్ ప్లాంట్ పనులు ఎందుకు ఆపారో చెప్పాలి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి


