వరినారు పోద్దామంటే వణుకు పుడుతోంది | - | Sakshi
Sakshi News home page

వరినారు పోద్దామంటే వణుకు పుడుతోంది

Jul 4 2026 2:43 AM | Updated on Jul 4 2026 2:43 AM

వరినారు పోద్దామంటే వణుకు పుడుతోంది కవ్విస్తున్న మేఘాలు.. ఎండిపోతున్న చేలు!

‘బోర్ల కింద సాగు చేద్దామని అప్పోసప్పో చేసి విత్తన వడ్లు తెచ్చుకుని సిద్ధంగా ఉంచాం. కానీ వానదేవుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఒకవేళ సాహసించి నారుమడి పోశాక వానలు కురవకపోతే, బోర్లలో నీరు అడుగంటిపోతే పెట్టిన పెట్టుబడంతా బుగ్గిపాలవుతుంది. ముందుకు వెళ్లాలో, వెన క్కు తగ్గాలో తెలియక నారుమడి పోసేందుకు తీవ్ర ద్వివిధావస్థలో (డైలమాలో) కొట్టుమిట్టాడుతున్నాం.’

– వీరభద్రారెడ్డి, రైతు, ఏటూరు.

‘పత్తి విత్తనాలు వేయడానికి ఒక మంచి పదును వాన కోసం ఆకాశం వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాం. రోజురోజుకూ వానదేవుడు ఊరిస్తూ వెనక్కే వెళ్తున్నాడు తప్ప వంగి ఒక్క చినుకు కురిపించడం లేదు. ఆకాశమంతా కారుమబ్బులతో నిండి వర్షం వస్తుందేమోనని ఆశ రేపుతోంది.. కానీ విపరీతమైన ఈదురు గాలులు వచ్చి ఆ మేఘాలను కాస్తా తేల్చేస్తున్నాయి. ఈ ఏడాది మా బతుకులు ఏమవుతాయో ఆ దేవుడికే తెలియాలి.’ – గొంగటి శ్రీనివాసులరెడ్డి, రైతు,

కోర్రపాడు గ్రామం (రాజుపాలెం మండలం)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement