వైద్యం వికటించి చిన్నారి మృతి | - | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి చిన్నారి మృతి

Jul 4 2026 2:43 AM | Updated on Jul 4 2026 2:43 AM

పులివెందుల రూరల్‌ : పులివెందులలోని నగరిగుట్ట క్రిస్టియన్‌లైన్‌కు చెందిన ప్రేమ్‌ కుమార్తె మోక్షిత (11) కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. గురువారం కడుపు నొప్పి ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు ముద్దనూరు రోడ్డులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఇంజెక్షన్‌ వేసి కడపకు తీసుకెళ్లాలని చెప్పారు. కడప తీసుకెళ్లి ఆసుపత్రిలో చికిత్స అందించేలోపే మోక్షిత మృతి చెందినట్లు బంధువులు, తల్లిదండ్రులు తెలిపారు. దీంతో వారు పులివెందుల పట్టణంలోని ఆ ప్రైవేట్‌ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మోక్షిత మృతి చెందిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అర్బన్‌ సీఐ శ్రీరామ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి గొడవలు జరగకుండా వైద్యులతోపాటు మృతురాలు మోక్షిత తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడారు. ఆందోళకారులను శాంతింపజేశారు.

ఆసుపత్రి వద్ద తల్లిదండ్రులు,

బంధువుల ఆందోళన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement