– రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి
రాజంపేట: పార్టీ మారితే అభిమానం మారుతుందా అని.. జమ్మలమడుగు నియోజకవర్గంలోని దేవగుడిలో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహం కూల్చివేతపై రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి ప్రశ్నించారు. రాజంపేటలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దేవగుడిలో కూటమి పార్టీ అనుచరులు వైఎస్సార్ విగ్రహం కూల్చివేయడం దారుణమన్నారు. ఇలాంటి దౌర్జన్యకర సంఘటనలు ఎక్కడి జరిగినా అది విషసంస్కృతిగా భావించాల్సిన వస్తుందన్నారు. దేవగుడి సోదరులకు దివంగత సీఎం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి రాజకీయ ఉజ్వలభవిష్యత్తు కల్పించారన్నారు. అటువంటి విషయాన్ని మరిచి మహానేత విగ్రహాన్ని కూల్చివేయడం దారుణచర్యగా భావించాల్సి వస్తోందన్నారు. దివంగత సీఎం వైఎస్సార్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు ఆదినారాయణరెడ్డి లేదని మేడా తెలిపారు.


