వైఎస్సార్‌ విగ్రహం చేయి విరగ్గొట్టిన దుండగులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ విగ్రహం చేయి విరగ్గొట్టిన దుండగులు

Jul 4 2026 2:43 AM | Updated on Jul 4 2026 2:43 AM

పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

సింహాద్రిపురం : వైఎస్సార్‌ కడప జిల్లా సింహాద్రిపురం మండలం పైడిపాలెం గ్రామ సమీపంలో ఉన్న జీకేఎల్‌ఐ గెస్ట్‌ హౌస్‌ వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి చేయిని దుండగలు విరగ్గొట్టగా.. అక్కడ ప్రారంభించిన శిలాఫలాకాన్ని ధ్వంసం చేసిన ఘటన గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు చూడాలన్న ధ్యేయంతో దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆయన సొంత ఆలోచనలతో సింహాద్రిపురం మండలంతోపాటు తొండూరు మండలానికి తాగు, సాగునీరు అందించాలన్న ధృడ సంకల్పంతో పైడిపాలెం రిజర్వాయర్‌ ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేయించారు. ప్రస్తుతం ఆయా మండలాల్లోని రైతులకు తాగు, సాగునీరు కష్టాలు తొలగిపోయాయి. వైఎస్సార్‌ చలువతో ఆయన గుర్తింపుగా జీకేఎల్‌ఐ గెస్ట్‌ హౌస్‌ వద్ద పైడిపాలెం గ్రామస్తులు వైఎస్సార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసి కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిచేత ప్రారంభించారు. అయితే గురువారం సాయంత్రం వరకు బాగా ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి శుక్రవారం తెల్లవారుజామున ఒక చేయి విరగ్గొట్టి అక్కడే ప్రారంభించిన శిలాఫలాకాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇన్‌చార్జి సీఐ శ్రీరామ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వెళ్లారు.

దుండగులు విరగొట్టిన

వైఎస్సార్‌ విగ్రహం చేయి

జీకేఎల్‌ఐ గెస్ట్‌ హౌస్‌ వద్ద శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement