మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

Jul 4 2026 2:43 AM | Updated on Jul 4 2026 2:43 AM

పులివెందుల రూరల్‌ : మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని డీఆర్‌డీఏ ఏపీఎం ఆంజనేయులు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సభా భవనంలో సెర్ఫ్‌ డీఆర్‌డీఏ, టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ సంయుక్త సహకారంతో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళా సంఘం సభ్యులు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు చేయడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చన్నారు. ఏపీఎం గురురాజు మా ట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాలు, సీ్త్రనిధి రుణా లు ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉన్నతి రుణాల ద్వారా చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహకానికి నిధులు స మకూర్చనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌వీఈ పీ బ్లాక్‌ మేనేజర్‌ వెంకటస్వామి, ఎస్‌వీఈపీ మెంటర్‌ వహఋదా, సీఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement