– ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో గండికోట ముంపువాసుల కు పరిహారణ, రాజోళి రైతులకు రూ. 24 లక్షలు ఇప్పిస్తామని ఇచ్చిన హామీలపై నిలదీస్తే.. చెప్పుదెబ్బలు తప్పవని బెదిరించడం ఆది అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ‘ఫ్యాక్షన్ వద్దు.. ఫ్యాషన్ ముద్దు’ అంటూనే ఆది నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. వైఎస్ కుటుంబంపై విమర్శలు చేస్తే చంద్రబాబు మంత్రి పదవి ఇస్తాడనే ఆశతోనే ఆది తూగుతున్నాడన్నారు. చేతనైతే ముందు నిర్వాసితులకు న్యాయం చేయాలని, అప్పుడు తామే స్వయంగా శాలువాతో సన్మానిస్తామన్నారు. ఆదిలాంటి అవినీతి అనకొండలను పెంచి పోషిస్తే టీడీపీ నామరూపాలు లేకుండా పోవడం ఖాయమని చంద్రబాబును హెచ్చరించారు.


