– రాచమల్లు ప్రసాద్‌రెడ్డి
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆదినారాయణరెడ్డి ఉత్తరకుమారుడిలా ప్రగల్బాలు పలుకుతున్నాడన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేది ఇక మూడేళ్లేనని, ఆ తర్వాత నీ గతి ఏంటో చూసుకోవాలని హెచ్చరించారు. చావైనా బతుకై నా తాము వైఎస్ కుటుంబం వెంటే నడుస్తామన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను పరిశీలించడానికి వచ్చిన సీనియర్ నాయకుడు రఘురామిరెడ్డిని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడతావా.. సీనియర్లంటే కనీసం గౌరవం కూడా లేదా అని ఆదిని నిలదీశారు. బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ డెప్యూటీ సీఎం అంజాద్‌బాషా, రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.


