– అంజద్ బాషా
కడప కార్పొరేషన్: దేవగుడి గ్రామంలో, అలాగే ఇటీవల నంద్యాలలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయడం దుర్మార్గమని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మట్లాడారు. ఇటువంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతున్న వారి పేర్లన్నీ ‘డిజిటల్ బుక్’లో నమోదు చేస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చాక వీళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని హెచ్చరించారు. మైనార్టీ నాయకులు షఫీ, కరీముల్లా, ఇలియాస్, గౌసులాజం, జఫ్రుల్లా, జమీల్ పాల్గొన్నారు.


