ప్రజల భద్రత కోసమే పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజల భద్రత కోసమే పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

Jul 3 2026 1:40 AM | Updated on Jul 3 2026 1:40 AM

ప్రజల భద్రత కోసమే పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

పులివెందుల రూరల్‌ : పులివెందులలో శాంతి భద్రతల దృష్ట్యా ప్రజల భద్రత కోసం పోలీస్‌ స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను రాయలసీమ రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌, ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ ప్రారంభించారు. పులివెందులలో సుమారు 8సర్కిల్‌ ప్రధాన కూడళ్లలో ఆధునిక పరికరాలతో 120 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రారంభించారు. పోలీస్‌ స్టేషన్లో ఉన్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూంను పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను సన్మానించారు. డీఎస్పీ మురళి నాయక్‌, సీఐలు శ్రీరామ్‌, ప్రసాదరావు, శాంతిలాల్‌, నరసింహులు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement