● పిరికి చర్య | - | Sakshi
Sakshi News home page

● పిరికి చర్య

Jul 3 2026 1:40 AM | Updated on Jul 3 2026 1:40 AM

జమ్మలమడుగు: జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్‌ రెడ్డి అనుచరులు ధ్వంసం చేయడం అత్యంత పిరికిపంద చర్య అని, ఇది వైఎస్సార్‌ అభిమానుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. ఈ ఘాతుకానికి నిరసనగా గురువారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు నల్లబ్యాడ్జీలు ధరించి భారీ ప్రదర్శన చేపట్టాయి. అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ నరేష్‌బాబుకు వినతిపత్రం సమర్పించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement