జమ్మలమడుగు: జమ్మలమడుగు నియోజకవర్గంలోని దేవగుడి గ్రామ ప్రారంభంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున కూటమి నేతలు ధ్వంసం చేయ డం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనతో ఆగ్రహించిన పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు వివిధ మండలాల నుంచి భారీ సంఖ్యలో ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి కార్యాలయానికి తరలివచ్చారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ వాలంటీర్ విభాగ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ విభాగ జిల్లా అధ్యక్షుడు హృషికేశవరెడ్డి, ఎస్‌ఈసీ సభ్యుడు గిరిధర్‌రెడ్డి, ముల్లాజానీ,మోహన్‌రెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.


