● బాబు మెప్పు కోసమే వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

● బాబు మెప్పు కోసమే వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం

Jul 3 2026 1:40 AM | Updated on Jul 3 2026 1:40 AM

● బాబు మెప్పు కోసమే వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం

– ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి

రాజంపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు మొప్పు పొందడం కోసమే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దేవగుడిలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయించారని వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ధ్వజమెత్తారు. రాజంపేటలోని తన స్వగృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవగుడి గ్రామంలో ఆదినారాయణరెడ్డి అనుచరులు, కూటమి నేతలు చేసిన ఈ దుశ్చర్య చూసి రాష్ట్ర ప్రజలంతా నివ్వెరపోయారన్నారు. దేవగుడి సోదరులకు కనీస కృతజ్ఞత, విశ్వాసం లేవని ఆకేపాటి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతలు పాపినేని విశ్వనాథరెడ్డి, జావిద్‌అలీ, గోవర్ధన్‌రెడ్డి, భరత్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement