కేబుల్‌..ట్రబుల్‌ | - | Sakshi
Sakshi News home page

కేబుల్‌..ట్రబుల్‌

Jul 3 2026 1:40 AM | Updated on Jul 3 2026 1:40 AM

విద్యుత్‌ స్తంభాలు విద్యుత్‌ సరఫరా కోసం ఏర్పాటు చేసినవే. కానీ నేడు వాటిపై కేబుల్‌, ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ వైర్లు గుట్టలు..గుట్టలుగా కనిపిస్తున్నాయి. ఈ అదనపు వైర్ల వల్ల ప్రమాదాలు, నిర్వహణలో ఇబ్బందులు, ప్రజల భద్రతకు ముప్పు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పులివెందుల పరిధి కడప రోడ్డులోని ఎన్‌న్‌జీఓ కార్యాలయం, శ్రీరామహాలు రోడ్డులో నాగుల కట్ట వద్ద విద్యుత్‌ స్తంభానికి దర్శనమిస్తున్న ప్రైవేట్‌ కేబుల్‌ వైర్లే దీనికి నిదర్శనం.పెను ప్రమాదం జరగక ముందే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

– పులివెందుల రూరల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement