అద్దాలమర్రిలో టీడీపీ నేత దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

అద్దాలమర్రిలో టీడీపీ నేత దౌర్జన్యం

Jul 3 2026 1:40 AM | Updated on Jul 3 2026 1:40 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : వైఎస్సార్‌ కడప జిల్లా చక్రాయపేట మండలం అద్దాలమర్రిలో టీడీపీ నేత శ్రీరామిరెడ్డి దౌర్జన్యానికి దిగారని, అధికార అండతో పెట్రేగిపోతున్నాడని బాధిత రైతు రామకృష్ణారెడ్డి వాపోయాడు. వివరాల్లోకి వెళితే తన పొలానికి పక్కనే శ్రీరామిరెడ్డికి చెందిన పొలం ఉందన్నాడు. గురువారం ఉదయాన్నే తన పొలంలో వరి నారు పోసుకునేందుకు వెళ్లానని చెప్పారు. ఆ సమయానికే శ్రీరామిరెడ్డి నా పొలంలోకి అక్రమంగా చొచ్చుకు వచ్చి పాత గట్టు ఉండగానే.. కొత్త గట్టు వేశాడన్నారు. ఇదేమని అడిగితే నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ దాడికి ప్రయత్నించినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తాను చక్రాయపేట పోలీసులు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement