● జేసీబీ, ట్రాక్టర్లు తీసుకొచ్చి దౌర్జన్యం
● దౌర్జన్యకారులకు అధికార పార్టీ
అండదండలు
● న్యాయం చేయాలని
బాధిత మహిళ వేడుకోలు
మీడియాతో మాట్లాడుతున్న బాధితురాలు పుష్పవతి, మానసిక వికలాంగుడైన కుమారుడు
వైఎస్సార్‌సీపీ నేతలు, స్థానికులు రావడంతో వెనక్కి పోతున్న జేసీబీ, ట్రాక్టర్లు
ఇంటిని కూల్చేందుకు తీసుకొచ్చిన జేసీబీ, ట్రాక్టర్లు
కడప కార్పొరేషన్: ఆర్థిక అంశాలపై ముడిపడిన విషయంలో కడప ఎర్రముక్కపల్లెలో అర్ధరాత్రి దళితుల ఇంటిని నేలమట్టం చేసిన ఘటన మరువక ముందే ప్రకాష్‌నగర్‌లో అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అయితే అగ్రవర్ణాలకు చెందిన వారు పట్టపగలే జేసీబీ, ట్రాక్టర్లు, కూలీలను తీసుకొచ్చి ఇంటిని కూల్చేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...ప్రకాష్‌నగర్‌కు చెందిన నాగభూషణం ఎల్‌ఐసీలో పనిచేసేవాడు. ఈయనకు భార్య పుష్పవతి, ఒక కుమార్తె, మానసిక వికలాంగులైన ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా వేణుగోపాల్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద తన ఇంటిని ఆయకం పెట్టి నాగభూషణం రూ.5లక్షలు అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన బతికి ఉన్నంత వరకు కుటుంబ సభ్యులెవరికీ ఈ విషయం తెలీదు. రెండేళ్లక్రితం నాగభూషణం మరణించడంతో వేణుగోపాల్‌రెడ్డి మరొక వ్యక్తి రామ్మోహన్‌రెడ్డికి దాన్ని విక్రయించినట్లు సమాచారం. సదరు రామ్మోహన్‌రెడ్డి దీనిపై కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కింది కోర్టులో తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చినప్పటికీ ...ఇంట్లో ఉన్నవారిని ఖాళీ చేయించేందుకు అవసరమైన ఉత్తర్వులు తెచ్చుకోకుండా పట్టపగలే ఇంటిని కూల్చేందుకు మందీమార్భలంతో రావడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరికి అధికార పార్టీ నేతలు అండదండలు ఇస్తున్నట్లు తెలిసింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై బాధితురాలు పై కోర్టులో అప్పీలు చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఆ ఇంట్లోకి ఆక్రమణదారులు గంజాయి బ్యాచ్‌ను దింపి, అక్కడే తిని, తాగడం చేస్తున్నారని బాధితురాలు చిన్నచౌకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది కోర్టులో ఉన్నది కాబట్టి తాము జోక్యం చేసుకోలేమని పోలీసులు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఈనెల 3వ తేది ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో పోలీసులు అంతా బందోబస్తు కోసం వె ళ్లినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ దళిత నేతలు, స్థానికులు బాధితురాలికి అండగా నిలవడంతో ఆక్రమణదారులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు వచ్చి అక్కడ గుమి కూడి ఉన్నవారందరినీ పంపించి వేశారు.
మాకు న్యాయం చేయాలి
తన భర్త మృతి చెందిన తర్వాత తమ ఇంటిని వేణుగోపాల్‌రెడ్డి తన అత్త సరోజమ్మ పేరు మీద రిజిస్టర్ రిజిస్టర్ చేయించి, రామ్మోహన్‌రెడ్డికి విక్రయించినట్లు పేపర్లు సృష్టించారన్నారు. ప్రకాష్ నగర్‌లో సెంటు స్థలం విలువ రూ.30లక్షల వరకు ఉందన్నారు. మూడు సెంట్ల స్థలం రూ.90లక్షలు చేస్తుందన్నారు. కేవలం రూ.5లక్షలు ఇచ్చి తమ విలువైన ఆస్థిని కొట్టేయాలని చూస్తున్నారన్నారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. తనకు ఇద్దరు మానసిక వికాలాంగులైన ఇద్దరు పిల్లలు, పెళ్లి కావాల్సిన కుమార్తె ఉందని, ఈ ఆిస్తి పోతే తాను వారిని ఎలా పోషించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాఽకారులు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.


