పటిష్ట భద్రత
– జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్
జమ్మలమడుగు రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 3వ తేదీ జిల్లా పర్యటనలో భాగంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్యేల్యె ఆదినారాయణరెడ్డి, డీఐజి కోయా ప్రవీణ్, జిల్లా ఎస్పీ షెల్కె నచికేత్ విశ్వనాథ్, జేసీ డాక్టర్ నిధి మీనా, సబ్ కలెక్టర్ భావనలతో కలసి ఉక్కు కర్మాగార పనులను, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సందర్శించనున్న ఆలయ ప్రాంగణాన్ని, సభా స్థలి ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు, ప్రొటోకాల్ నిబంధనల మేరకు పాటించాల్సిన నియమాలపై అధికారులకు సూచించారు.
కడప సెవెన్‌రోడ్స్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 3వ తేదీ (శుక్రవారం) ఒకరోజు పర్యటన నిమిత్తం వైఎస్సార్ కడప జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మలమడుగు పరిధిలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులు, సోలార్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. సీఎం చంద్రబాబు ఒకరోజు పర్యటన సమయ పట్టిక
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
సమయం పర్యటన వివరాలు
ఉదయం 10:30 గంటలకు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి వద్ద ఉన్న
జెఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ఎల్ ప్లాంట్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
ఉదయం 10:40 గంటలకు హెలిప్యాడ్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరుతారు.
ఉదయం 10:45 గంటలకు కన్య తీర్థం బాలా త్రిపుర సుందరి సమేత
శ్రీ సుందరేశ్వర స్వామి దేవస్థానం దర్శనం.
ఉదయం 10:55 గంటలకు జెఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ సైట్‌కు చేరుకుంటారు.
ఉదయం 11:05 గంటలకు జేఎస్‌డబ్ల్యు ఆర్‌ఎస్‌ఎల్ హెవీ సెక్షన్ మిల్ కాంక్రీటు ఫ్లోరింగ్
కార్యక్రమంలో పాల్గొంటారు.
ఉదయం 11:10 నుండి జెఎస్‌డబ్ల్యూ ప్లాంట్ సైట్ మరియు ఎక్స్‌పీరియన్స్ జోన్ సందర్శన.
మధ్యాహ్నం 1:35 వరకు జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ లిమిటెడ్ ప్రాజెక్టు నిర్మాణ పనుల
శిలాఫలకం ఆవిష్కరణ. 400 మెగావాట్ల సోలార్ ప్లాంట్,
ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపనల శిలాఫలకాల ఆవిష్కరణ.
మధ్యాహ్నం 2:10 గంటలకు ప్లాంట్ సైట్ హెలిప్యాడ్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా
కుప్పంకు ప్రయాణమవుతారు.


