● భార్యభర్తలు మృతి
● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
వేంపల్లె: వేంపల్లె మండలంలోని తాళ్లపల్లె గ్రామం వద్ద ప్రధాన రహదారిలో మిక్చర్ బండిపై లారీ దూసుకొచ్చింది. ఈ ఘటనలో భార్యాభర్తలు ఇద్దరు అక్కడ్కడికే మృతి చెందారు. స్థానికుల వివరాలు మేరకు.. తాళ్లపల్లె గ్రామానికి చెందిన వెంకట లక్ష్ముమ్మ (40), వెంకట శేషు మురళి (45) భార్యభర్తలు. వీరు తోపుడు బండిపై మిక్చర్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్యభర్తలు మిక్చర్ అమ్ముకొంటుండగా బుధవారం సాయంత్రం వేంపల్లె నుంచి బెంగళూరుకు వెళ్తుతున్న లారీ తాళ్లపల్లి గ్రామ సమీపంలోకి రాగానే ప్రధాన రహదారి పక్కన ఉన్న తొపుడు బండిపైకి దూసుకెళ్లింది. దీంతో భార్యాభర్తలు కల్యాణి, వెంకట శేఘ మురళి అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే కూల్ డ్రింక్ షాపు నిర్వాహకుడితో పాటు మరొక వ్యక్తి త్రీవంగా గాయపడ్డాడు. ఘటన తెలిసిన వెంటనే సిఐ నర్సింహులు తాళ్లపల్లికు వెళ్లి ప్రమాదంపై ఆరా తీశారు. మృతదేహలను వేంపల్లె ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వెంకట శేషు మురళి, వెంకట లక్ష్ముమ్మ(ఫైల్)
ప్రమాదానికి కారణమైన లారీ లారీ ఢీకొని కూలిపోయిన పాఠశాల ప్రహరీ


