కడప అర్బన్: వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండలం ఖాదర్‌పల్లి గ్రామానికి చెందిన షేక్ షఫీ (25) అనే యువకుడిపై జూన్ 30న పీడీయాక్ట్ ప్రయోగించారు. ఇతనిపై 4 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు, ఒక పోక్సోకేసు నమోదయ్యాయి. ఈ కేసుల కారణంగా ఇతన్ని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. జైలు నుంచి విడుదలైన అతను తన అలవాటును మార్చుకోలేదు, మళ్లీ రెండు కేసుల్లో ఇతనిపై కేసులు నమోదయ్యాయి. ఇతనికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అనేక మంది అంతర్జాతీయ ఎరచ్రందనం స్మగ్లర్లతో సంబంధాలున్నాయి. ఇతనిపై పీడీ చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ(అడ్మిన్) కె.ప్రకాష్ బాబు పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్లు సి.శంకర్ రెడ్డి, జె.శివ శంకర్‌ల సూచనల మేరకు కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పీడీ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులను జారీ చేయమని ప్రతిపాదనలు సమర్పించారు. దానిని సంబంధిత నిందిడుడిపై అమలు నిమిత్తం సెంట్రల్ జైలు అధికారులకు అందజేశారు.


