జమ్మలమడుగు రూరల్: ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్న నేపత్యంలో కలెక్టరు డాక్టర్ చెరుకూరి శ్రీధర్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి, ఎస్పీ నచికెత్ విశ్వనాథ్, స్టీల్ ప్లాంట్ ప్రతినిధులతో కలసి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జులై 3వ తేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లె పంచాయతీలో ఏర్పాటు చేసే ఉక్కు పరిశ్రమ ప్రారంభోత్సవానికి రానున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై నేతలతో, అధికారులతో ఆయన సమీక్షించారు. జేసీ డాక్టర్ నిధి మీనా, సబ్ కలెక్టర్ భావన అర్డీఓ శీరిషా, జేఎస్‌డబ్ల్యూ యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో ఐదు మండలాల్లో వర్షం
కడప అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా సోమవారం తె ల్లవారుజామున ఐదు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా పోరుమామిళ్లలో అత్యధి కంగా 48.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే కలసపాడులో 5.4, బి.కోడూరులో 3.6, వల్లూరులో 2.6, దువ్వూరులో 1.6 మి.మీ వర్షం కురిసింది.
కడప కోటిరెడ్డిసర్కిల్ : గుజరాత్‌లోని వల్సాడ్ నుంచి కడప మీదుగా తమిళనాడులోని వేలాంగిణికి జులై 3న ప్రత్యేక రైలును నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేది ఈ రైలు (09030) సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి లోనావాల, పుణె, దౌండ్, కలబురిగి, వాడి, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడపకు మరుసటిరోజు రాత్రి 9.35 గంటలకు చేరుతుందని పేర్కొన్నారు. అలాగే రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, వేలూరు, తిరుమన్నామలై, విల్లుపురం జంక్షన్, చిదంబరం, కరైకాల్, నాగూరు, నాగపట్నం మీదుగా వేలాంగిణికి 5వ తేది రాత్రి 10 గంటలకు చేరుతుందన్నారు. ఇదేరైలు అదేరోజు రాత్రి 12.30 గంటలకు బయలుదేరి 7వ తేది ఉదయం 10.30 గంటలకు వల్సాడ్‌కు చేరుతుందన్నారు.రిజర్వేషన్ సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు.


