ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 9:30 గంటల నుంచి సీతాసమేతుడైన శ్రీ కోదండ రాముడి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని రాతి కల్యాణ మండపంలో అర్చకులు సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఆశీనులు చేసి, నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం సీతాసమేతుడైన శ్రీ కోదండ రామస్వామికి ఆలయ అర్చకులు వీణా రాఘవాచార్యులు, వీణా మనోజ్ కుమార్ వైభవంగా పౌర్ణమి కల్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. టీటీడీ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. – ఒంటిమిట్ట


