మేఘమా..కురవవే! | - | Sakshi
Sakshi News home page

మేఘమా..కురవవే!

Jun 30 2026 2:23 AM | Updated on Jun 30 2026 2:23 AM

మేఘమా..కురవవే!

రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నా.. వైఎస్సార్‌ కడప జిల్లాలో మాత్రం వరుణ దేవుడు కరుణించడం లేదు. జిల్లావ్యాప్తంగా ఆకాశంలో మేఘాలు దాగుడుమూతలు ఆడుతున్నాయే తప్ప గట్టిగా ఒక మోస్తరు వాన కూడా పడటం లేదు. సోమవారం కడప నగర వీధులపై నిండా నీలి మేఘాలు కమ్మేయడంతో, పగటిపూటే సంధ్యాసమయం తరహాలో మబ్బులు పరుచుకున్న దృశ్యాలు కనువిందు చేశాయి. ఆకాశంలో దట్టమైన మేఘాలను చూసి ఎప్పుడెప్పుడు వర్షం కురుస్తుందా అని ప్రజలతో పాటు జిల్లాలోని రైతాంగం కూడా వెయ్యి కళ్లతో ఆశగా ఎదురుచూస్తోంది.చినుకు పడితేనే సాగు పనులు వేగవంతం అవుతాయని, మేఘాల దాగుడుమూతలు వీడి త్వరలోనే భారీ వర్షాలు కురవాలని వరుణుడిని వేడుకుంటున్నారు. – సాక్షి ఫోటో గ్రాఫర్‌, కడప.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement