కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడారు. మొత్తం 125 ఫిర్యాదులు పీజీఆర్‌ఎస్‌కు వచ్చాయి. చట్ట పరిధిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అర్జీలు పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ఫోనన్‌లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్ , డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం తదితరులు పాల్గొన్నారు.


