ఐషర్‌ వాహనం–ట్యాంకర్‌ ఢీ: ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

ఐషర్‌ వాహనం–ట్యాంకర్‌ ఢీ: ఒకరి మృతి

Jun 30 2026 2:23 AM | Updated on Jun 30 2026 2:23 AM

జమ్మలమడుగు/మైలవరం : మైలవరం మండలంలోని వద్దిరాల– ధన్నవాడ గ్రామాల మధ్య ఐషర్‌ వాహనం, ట్యాంకర్‌ ఎదురెదురుగా ఢీకొనడంతో ఐషర్‌ వాహనం డ్రైవర్‌ ఉదయగిరి శ్రావణ్‌కుమార్‌(32) అక్కడికక్కడే మృతిచెందాడు .ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. దాల్మియానుంచి సిమెంట్‌ లోడుతో వెళుతున్న లారీ వద్దిరాల దాటిన తర్వాత కొలిమిగుండ్ల నుంచి వచ్చిన ఐషర్‌ వాహనం ఎదురురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఉదయగిరి శ్రావణకుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.ఐషర్‌ వాహనం టాపుపై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతను మాట్లాడలేకపోవడంతో ఇతను ఎవరన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ట్యాంకర్‌ డ్రైవర్‌ మెల్ల రాజశేఖర్‌ కూడా గాయపడ్డాడు. వీరిద్దరిని అంబులెన్సులో జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమిచికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు. ఐషర్‌ లారీలో ఇరుక్కున్న ఉదయగిరి శ్రావణ్‌కుమార్‌ మృతదేహాన్ని రూరల్‌సీఐ కులాయప్ప , ఎస్‌ఐలు హైమావతి, శ్యాంసుందర్‌రెడ్డి జేసీబీతో బయటికి తీయించారు. ఐషర్‌ లారీ పోరుమామిళ్ల మండలం వాసుదేవపురానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.

జాతీయస్థాయి

పోటీలకు ఎంపిక

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : తిరుపతిలో ఈ నెల 28న జరిగిన 6వ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కరాటే చాంపియన్‌షిప్‌ కమ్‌ నేషనల్‌ సెలెక్షన్స్‌–2026లో కడపకు చెందిన విజయ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కరాటే అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోలా ప్రతాప్‌, ప్రధాన కార్యదర్శి ఎం. విజయ్‌ పేర్కొన్నారు. ఈ పోటీల్లో అకాడమీకి చెందిన 30 మంది విద్యార్థులు పాల్గొని 10 బంగారు, 12 వెండి, 8 కాంస్య పతకాలు సాధించారు. ఆగస్టు 7, 8 తేదీలలో కోల్‌కతాలో జరిగే కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌ కోసం అకాడమీకి చెందిన 9 మంది విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు.

ఎంపికై న విద్యార్థులు : ఎం. అను, ఏంజెల్‌, ఎం. మేఘన, టి. హాసిని,ఎం. అబ్దుల్లా ఖాన్‌,ఎన్‌. వజ్ర దత్‌, ఎ. తన్వితాక్షి, ఎం. రోహన్‌, కె. ఆరోన్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement