బైక్‌ను ఢీకొన్న కారు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న కారు

Jun 29 2026 1:29 AM | Updated on Jun 29 2026 1:29 AM

బైక్‌ను ఢీకొన్న కారు

ఇద్దరికి తీవ్రగాయాలు

ఒంటిమిట్ట: మండల పరిధిలోని కడప–చైన్నె జాతీయ రహదారిపై ఆదివారం ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.పోలీసుల వివరాల మేరకు..కడప నుంచి తిరుపతి వెళుతున్న కారు, కడప వైపు ద్విచక్రవాహనంలో వెళుతున్న కడప బుడ్డాయపల్లికి చెందిన భార్యాభర్తలు రాధా(25), మణి(30)లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మణి కాళు నుజ్జు అయ్యాయి.రాధ తలకు బలమైన గాయమైంది. స్థానికులు గాయపడిన వారిని 108 సహాయంలో కడప రిమ్స్‌ కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement