గంగేశ్వరి.. గృహానికి సిరి
గంగాదేవి..లక్ష్మీదేవి
కడప అగ్రికల్చర్: 2023ను ఐక్యరాజ్యసమితి ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’గా ప్రకటించిన తర్వాత చిరుధాన్యాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ వేవ్‌ను కడప జిల్లా రైతులు, మహిళలు స్వయం ఉపాధిగా మార్చుకునేందుకు ఉటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 29వ తేదీ నుంచి నాబార్డ్ ఆర్థిక సహకారంతో ‘మిల్లెట్లతో స్వయం ఉపాధి – వ్యవసాయ ఆధారిత సూక్ష్మ పరిశ్రమల స్థాపన’ శిక్షణ ప్రారంభం కానుంది. రాయలసీమలో విస్తారంగా పండే సజ్జ, కొర్రలు, అరికెలు, ఊదలు, సామలు వంటి మిల్లెట్లను ముడిసరుకుగా వాడుకుని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చే పూర్తి స్కిల్‌ను రెండు వారాల్లో నేర్పిస్తారు.
తొలి 250 మందికే ఉచితం
10 బ్యాచ్‌లు నాబార్డ్ ప్రాయోజిత ఈ శిక్షణలో తొలి 250 మందికి పూర్తిగా ఉచితం. మొత్తం 10 బ్యాచ్‌లుగా నిర్వహిస్తారు. ఒక్కో బ్యాచ్‌లో 25 మందికి మాత్రమే సీటు. చదవడం, రాయడం తెలిసిన గ్రామీణ యువత, రైతు మహిళలు, సెల్ఫ్ హెల్ప గ్రూపు సభ్యులు, నిరుద్యోగులు ఎవరైనా అర్హులే. శిక్షణ తర్వాత సొంతంగా యూనిట్ పెట్టుకునే వారికి కేవీకే టెక్నికల్ గైడెన్స్, నాబార్డ్ సబ్సిడీ లోన్లకు లింకేజ్ కల్పిస్తారు.
ప్రాసెసింగ్ నుంచి బ్రాండింగ్ దాకా – సిలబస్ ఇదే
● ప్రొడక్షన్ – ప్రాసెసింగ్: మిల్లెట్ శుద్ధి, గ్రేడింగ్, పిండి తయారీ, ఎక్స్‌ట్రూడర్ టెక్నాలజీ
● విలువ ఆధారిత ఉత్పత్తులు: లడ్డూలు, బిస్కెట్లు, నూడుల్స్, పాస్తా, రాగి మాల్ట్, రెడీ–టు–ఈట్ మిక్సులు
● ప్యాకేజింగ్ – బ్రాండింగ్: లేబుల్ డిజైన్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రిజిస్ట్రేషన్, బార్‌కోడ్, షెల్ఫ్ లైఫ్ పెంపు
● మార్కెటింగ్: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్, స్థానిక హోల్‌సేల్, సిటీ సూపర్ మార్కెట్లలో ప్లేస్‌మెంట్
● ఫైనాన్స్: ముద్ర లోన్, స్టాండప్ ఇండియా స్కీం, నాబార్డ్ సబ్సిడీ – 35% వరకు గ్రాంట్
లక్షల ఆదాయం ఎలా?
MóSÒMóS ÌñæMýSPÌS {ç³M>-Æý‡…... OÆð‡™èl$ §ýlVýSYÆý‡ çÜfj MìSÓ…sê ₹2800&₹3200 ç³Ë$MýS$™ø…¨. A§ól çÜfj™ø ÌSyýl*zË$ ™èlĶæ*Æý‡$ ^ólíÜ 250{V> ´ëÅMðSsŒæ ₹60&₹70MìS AÑ$Ùól, MìSÓ…sêMýS$ ₹9000&₹10000 ÑË$Ð]l Ð]lçÜ$¢…¨. A…sôæ 3 Æð‡rÏ Ìê¿ýæ…. Oòßæ§ýl-Æ>»ê§Šæ, »ñæ…VýS-â¶æ*Æý‡$, ^ðlO¯ðl² Ð]l*Æð‡P-rÏÌZ "Ñ$ÌñæÏsŒæ' A¯ól {»ê…yŠæ™ø 40% {ï³Ñ$Ķæ$… «§ýlÆý‡ ÌSÀÝù¢…-¨.
ఎందుకు ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి?
డయాబెటిస్, ఊబకాయం పెరుగుతున్న నేపథ్యంలో గ్లూటెన్–ఫ్రీ, ఫైబర్ రిచ్ మిల్లెట్ ఫుడ్‌కు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్రం కూడా ప్రతి పాఠశాల మధ్యాహ్న భోజనంలో మిల్లెట్లను తప్పనిసరి చేసింది. మార్కెట్ రెడీగా ఉంది, స్కిల్ నేర్చుకునే వారు మాత్రం తక్కువగా ఉన్నారు.
రిజిస్ట్రేషన్ వివరాలు:
ఆసక్తి ఉన్నవారు 8247237649 నంబర్‌కు పేరు, ఊరు, ఫోన్ నంబర్ వాట్సాప్ చేయాలి. ఆధార్ జెరాక్స్, రెండు ఫోటోలతో శిక్షణ రోజున హాజరు కావాలి. సీట్లు త్వరగా ఫుల్ అయ్యే అవకాశం ఉంది.
భర్త అకాల మరణంతో కష్టాల కడలిలో పడినా, అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి స్వయం సమృద్ధి సాధించారు గాలివీడు మండలానికి చెందిన గంగాదేవి. వడ్రంగి పని చేసే భర్త కృష్ణమాచారి చనిపోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ తరుణంలో 2019లో ఆమె కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆశ్రయించారు. ఆమెలోని పట్టుదలను చూసి కేవీకే అధికారులు ‘ఐసీఏఆర్’ పథకం కింద చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అంతేకాకుండా, గృహ పరిశ్రమ స్థాపనకు వీలుగా ఆగ్రో ప్రాసెసింగ్ పరికరాలు, ముడి సరుకులను ఉచితంగా అందించారు. ప్రభుత్వ అండతో వ్యాపారంలో అడుగుపెట్టిన గంగాదేవి.. ప్రస్తుతం రాఖీ లడ్డు, బర్ఫీ, ఎస్‌ఎం లడ్డు, వేరుశనగ లడ్డు వంటి పోషక విలువలు గల మిఠాయిలను సొంతంగా తయారు చేస్తున్నారు. స్థానిక మార్కెట్ అనుసంధానంతో ప్రస్తుతం ఆమె నెలకు సగటున రూ.11,200 ఆదాయాన్ని అర్జిస్తున్నారు. కష్టాలకు ఎదురొడ్డి, ఆత్మవిశ్వాసంతో కుటుంబాన్ని ప్రశాంతంగా నడుపుకుంటూ తోటి మహిళలకు గంగాదేవి ఆదర్శంగా నిలిచారు.
సమాజంలో చిరుదాన్యాల వాడాకాన్ని పెండచం, వ్యాపార నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం పనిచేస్తోంది. ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను 2010లో ప్రారంచినప్పటి నుంచి 5 వేల మందికి పైగా శిక్షణ ఇచ్చాం.
– డాక్టర్ శీలం ప్రశాంతి, కమ్యూనిటి సైన్స్ శాస్త్రవేత్త, కృషి విజ్ఞానకేంద్రం.
రాయలసీమ వాతావరణం మిల్లెట్లకు వరం. కానీ రైతు ముడిసరుకు అమ్మి లాభం కోల్పోతున్నాడు. ఈ శిక్షణతో రైతునే తయారీదారుగా, బ్రాండ్ ఓనర్‌గా తయారు చేయడమే మా లక్ష్యం. శిక్షణ తర్వాత 6 నెలల పాటు హ్యాండ్‌హోల్డింగ్ సపోర్ట్ ఇస్తాం.
– డాక్టర్ శిల్పకళ, సమన్వయకర్త, కృషి విజ్ఞానకేంద్రం.
డిగ్రీ వరకు చదువుకున్న వల్లూరు గ్రామానికి చెందిన గంగేశ్వరి తన వృత్తి జీవితాన్ని మొదట ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో అకౌంటెంట్‌గా ప్రారంభించారు. ఆమెలోని అద్భుతమైన పనితీరు, నాయకత్వ నైపుణ్యాల కారణంగా చాలా తక్కువ సమయంలోనే అదే కంపెనీకి సీఈఓగా పదోన్నతి పొందారు. అయితే సొంతంగా ఒక బ్రాండ్‌ను నిర్మించాలనే లక్ష్యంతో కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించారు. అక్కడ చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ తీసుకున్నారు. అనంతరం సొంతంగా గృహ పరిశ్రమను స్థాపించి రాగిలడ్డు, జొన్న లడ్డు, మిల్లెట్ మురుకులు తయారు చేస్తూ వ్యాపారాన్ని విస్తరించారు. ప్రస్తుతం నెలకు రూ.10,000 నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వ్యాపారంలో మరింత ముందడుగు వేస్తూ, స్థానిక మార్కెట్ అనుసంధానాన్ని పెంచుకోవడానికి వల్లూరులోని గ్రామీణ రైతు బజార్ దుకాణంలో భాగస్వామిగా పెట్టుబడి పెట్టారు. స్వశక్తితో ఎదిగి, పదిమంది రైతులకు మార్కెట్ కల్పిస్తూ ఆర్థిక స్వావలంబన సాధించిన గంగేశ్వరి నేటి యువతకు నిలువెత్తు ఆదర్శంగా నిలిచారు.
సొంతంగా ఎదగాలనే సంకల్పం ఉంటే చిన్న వయసు, తక్కువ చదువు ఏమాత్రం అడ్డంకి కావని నిరూపించారు కడపకు చెందిన కోడూరు శ్రీకీర్తన. పదో తరగతి వరకే చదువుకున్నా, వంటలపై ఉన్న మక్కువతో సొంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాలనే బలమైన కోరికను ఆమె పెంచుకున్నారు. ఈ క్రమంలోనే 2022లో ఆమె కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆశ్రయించి, విభిన్న ఆహార ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. శిక్షణ అనంతరం చిరుధాన్యాల ప్రాధాన్యతను గుర్తించిన కీర్తన.. పోషక విలువలతో కూడిన సరికొత్త ఆహార పదార్థాల తయారీకి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆమె సొంతంగా మిల్లెట్ మిక్చర్, మురుకులు, రాగి లడ్డు, జొన్న లడ్డు, కజ్జికాయలు, కార్న్‌ఫ్లేక్స్ వంటి వివిధ రకాల విలువ ఆధారిత చిరుధాన్యాల ఉత్పత్తులను అత్యంత నాణ్యతతో తయారు చేస్తున్నారు.ఈ వినూత్న వ్యాపారం ద్వారా ఆమె ప్రస్తుతం నెలకు సగటున రూ.12,500 నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తక్కువ చదువుతోనే స్వశక్తితో వ్యాపార రంగంలో రాణిస్తూ, ఆర్థిక స్వాలంబన సాధించిన శ్రీకీర్తన నేటి యువతకు, తోటి మహిళలకు నిలువెత్తు ఆదర్శంగా నిలిచారు.


