కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాల ప్రవేశాల కోసం రెండు రోజులపాటు నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికలు ముగిశాయి. ఎంపికలకు మొత్తం 110 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఎస్‌డీఓ గౌస్‌బాషా తెలిపారు. మొదటిరోజు 104 మంది హాజరు కాగా రెండో రోజు శనివారం 6 మంది మాత్రమే హాజరయ్యారు. వీరికి రిమ్స్ వైద్యులు నిరంజన్ వైద్య పరీక్షలు, డీఎస్‌డీఏ కోచ్‌లు సామర్థ్య పరీక్షలను నిర్వహించారు. ఈ ఎంపికలకు 4వ తరగతిలో బాలురు 33, బాలికలు 11, 5వ తరగతిలో బాలురు 24, బాలికలు 17, 6వ తరగతిలో బాలురు 19, బాలికలు 06 హాజరయ్యారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారి పేర్లను జిల్లా కలెక్టర్ అనుమతితో శాప్‌కు పంపుతామన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికై న విద్యార్థులు విజయవాడలో రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎంపికల్లో పాల్గొనాలన్నారు. అక్కడ ప్రతిభ కనబరిచిన వారిని క్రీడా పాఠశాలలో చోటు కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఏ కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఒంటిమిట్ట రామయ్యకు స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం మూలవిరాట్‌లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.అర్చకులు సీతారామలక్ష్మణ మూర్తులను టీటీడీ ఆలయ అధికారులు తీసుకొచ్చిన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, తులసి గజమాలతో అందంగా అలంకరించారు. అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారిని దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.


