● ఆశలు నీరుగారిపోయాయి | - | Sakshi
Sakshi News home page

● ఆశలు నీరుగారిపోయాయి

Jun 28 2026 2:56 AM | Updated on Jun 28 2026 2:56 AM

● ఆశలు నీరుగారిపోయాయి

పులివెందులలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్‌ స్టేడియం ఏర్పాటైతే మా లాంటి ఎంతోమంది గ్రామీణ ఆటగాళ్లకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని ఎంతో ఆశపడ్డాం. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మా ఆశలన్నీ నీరుగారిపోయాయి. క్రికెట్‌ క్రీడల పట్ల, యువత ప్రోత్సాహం పట్ల అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఈ ప్రాంత క్రికెటర్ల కోసం స్టేడియం అందుబాటులోకి తేవాలని ఆయన శ్రమించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజకీయ కక్షతో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేసింది. ఇప్పటికై నా ప్రభుత్వం మొండివైఖరి వీడి చొరవ తీసుకొని, మిగిలిన అరకొర పనులను పూర్తి చేస్తే క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – శ్రావణ్‌రెడ్డి, క్రికెట్‌ క్రీడాకారుడు, పులివెందుల.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement