సర్‌దుబాటు సాగేనా! | - | Sakshi
Sakshi News home page

సర్‌దుబాటు సాగేనా!

Jun 28 2026 2:56 AM | Updated on Jun 28 2026 2:56 AM

సాక్షి, కడప ఎడ్యుకేషన్‌ : విద్యాశాఖలో ఏటా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరగడం సర్వసాధారణమే అయినా, ఈసారి జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉపాధ్యాయుల స్థానచలనాలకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తరగతి గదిలో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా జూన్‌ 27వ తేదీ శనివారం మండలస్థాయిలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించాల్సి ఉండగా.. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ అసలు ప్రారంభానికే నోచుకోలేదు.

పైనుంచి మార్పులు.. డేటా అస్తవ్యస్తం!

జిల్లాలోని మండలాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఎంతమంది ఉపాధ్యాయులు అవసరమవుతారు? అనే అంశాలపై విద్యాశాఖ అధికారులు ముందే ప్రాథమిక డేటాను సిద్ధం చేశారు. అయితే, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన తాజా ఆదేశాల మేరకు ఈ నివేదికల్లో కొన్ని కీలక మార్పులు చేయాల్సి రావడంతో పాటు, లబ్ధిదారుల డేటాను మళ్లీ సరి చేయాల్సి వచ్చింది. దీంతో జూన్‌ 27న మండల కేంద్రాల్లో జరగాల్సిన సర్దుబాటు పక్రియ పూర్తిగా వాయిదా పడింది.

అంతటా బ్రేకులు.. ఆలస్యం ఖాయం!

ప్రాథమిక దశ అయిన మండలస్థాయి సర్దుబాటు ప్రక్రియే సకాలంలో జరగకపోవడంతో, ఆ తర్వాత వరుసగా జరగాల్సిన డివిజన్‌స్థాయి, జిల్లాస్థాయి కౌన్సెలింగ్‌లు కూడా ఆటోమేటిక్‌గా వాయిదా పడినట్లేనని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అధికారుల సమన్వయ లోపం, సాంకేతిక లోపాల కారణంగా నివేదికల రూపకల్పన ఆలస్యమవడంతో.. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి కావాల్సిన ఉపాధ్యాయ సర్దుబాటు కౌన్సెలింగ్‌ ప్రక్రియ మరింత ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

కడప జిల్లాలో వాయిదా పడ్డ

ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌ ప్రక్రియ

డేటా సవరణల సాకుతో నిన్న నిలిచిన మండల స్థాయి కౌన్సిలింగ్‌

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో

ఉపాధ్యాయుల్లో తీవ్ర అయోమయం

జూన్‌ 30 నాటికి టీచర్ల కౌన్సెలింగ్‌ పూర్తయ్యేనా?

ప్రాసెస్‌ను మొదలు పెట్టాం..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయుల సర్థుబాటు పక్రియ మొదలు పెట్టాము. సాధారణంగా 27వ తేదీ మండలాల వారి సర్థుబాటు పక్రియ నిర్వహించాల్సి ఉంది. అయితే పైస్థాయి నుంచి కొంత ఆలస్యం కావడంతో ఈ పక్రియకు అవాంతరమేర్పడింది. ఈ పక్రియ నిర్ణీత గడువులోపు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం.

– షేక్‌ షంషుద్దీన్‌, జిల్లా విద్యాశాఖ అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement