కడప ఎడ్యుకేషన్: భారత జాతీయ కళలు, సాంస్కృతిక వారసత్వ సంస్థ కడప చాప్టర్ అడి షనల్ కో కన్వీనర్ గా ఓ. వెంకటేశ్వరెడ్డి నియమించారు. ఈ పదవిలో ఈ యన మూడేళ్ల పాటు కొనసాగుతారు.
1 నుంచి శిక్షణ తరగతులు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కర్నూలు నగరంలో జులై 1 నుంచి 4 వరకు నిర్వహించే ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. వలరాజు పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని హోచిమన్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. రెండేళ్ల పండగ పేరిట రాష్ట్రమంతా ఏదో పెద్ద చేశామన్న ఆనందంలో సంబరాలు చేసుకోవడం సరికాదని.. విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ శిక్షణ తరగతులలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాల పైన చర్చించి రాష్ట్రవ్యాప్తంగా సమరశీల పోరాటాలకు శ్రీకారం చుడతామన్నారు. అలాగే ఈ నెల 28 వతేదీ కడప నగరంలో జరిగే ఏఐఎస్‌ఎఫ్ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని ఆయ న కోరారు. ఏఐఎస్‌ఎప్ జిల్లా సహాయ కార్యదర్శి అరుణ్, నగర కార్యదర్శి రాజేష్, నగర సహాయ కార్యదర్శులు మల్లికార్జున రెడ్డి, అభిరామ్, చేతన్, తదితరులు పాల్గొన్నారు.
– డీఈవో షేక్ షంషుద్దీన్
కడప ఎడ్యుకేషన్: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పై భయాందోళనలు వీడాలని డీఈవో షేక్ శంషుద్దీన్ పేర్కొ న్నారు. శుక్రవారం కడపలోని యూటీఎఫ్ భవ న్లో ఆ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెట్ ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఎన్‌సీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా 2028 ఆగస్టు 31 లోపు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులంతా టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాల్సి ఉందని అన్నారు. టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించడంలో ఉపాధ్యాయులకు ఆందోళన అవసరమేలేదని, బోధనలో అపార అనుభవం ఉన్న ఉపాధ్యాయులు టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించడం పెద్ద సమస్యేమి కాదన్నారు. యూటీఎఫ్ ఉపా ధ్యాయులకు ఉచిత కోచింగ్‌ను ఏర్పాటు చేయ డం అభినందనీయమని పేర్కొన్నారు. యూ టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు మాట్లాడారు. టెట్ బోధకులు కోవెల ప్రసాద్ రెడ్డి, బి.మస్తాన్ వలి, యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎన్.నాగార్జున రెడ్డి, సహాధ్యక్షులు వై.రవికుమార్, డి.సుజాత రాణి, ట్రెజరర్ కె.నరసింహా రావు జిల్లా కార్యదర్శులు సి.వి.రమణ, ఎస్.ఎజాస్ అహ్మద్, ఎ.డి.దేవదత్తం, ఎన్.కంబగిరి, సి.సుదర్శన్, జె.వి.సుబ్బారెడ్డి, ఎ.వీరనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి.క్రిష్ణారెడ్డి, చెరుకూరి శ్రీనివాసులు పాల్గొన్నారు.


