జీడీఏఏపీ కార్యవర్గంలో కడప డాక్టర్లకు చోటు | - | Sakshi
Sakshi News home page

జీడీఏఏపీ కార్యవర్గంలో కడప డాక్టర్లకు చోటు

Jun 27 2026 1:43 AM | Updated on Jun 27 2026 1:43 AM

కడప అర్బన్‌ : గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (జీడీఏఏపీ) రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ జిల్లా కడపకు చెందిన నలుగురు ప్రభుత్వ వైద్యులు రాష్ట్ర కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా సేవలందిస్తున్న డాక్టర్‌ సునీల్‌ కుమార్‌రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, ప్రభుత్వ వైద్య కళాశాల(రిమ్స్‌)లో కమ్యూనిటీ మెడిసిన్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్‌ సి.వి.ఎస్‌.రాయుడు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ దంత వైద్య కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఓసురెడ్డి శ్రీదేవి డెంటల్‌ కార్యదర్శిగా, కడప ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌ స్వామి దాస్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లా నుంచి నలుగురు వైద్యులు ఏకగ్రీవంగా ఎన్నికవడం స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పని చేస్తున్న వైద్యులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. వైద్యుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement