ప్రారంభమైన క్రీడా పాఠశాల ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన క్రీడా పాఠశాల ఎంపికలు

Jun 27 2026 1:43 AM | Updated on Jun 27 2026 1:43 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : నగరంలోని డీఎస్‌ఏ క్రీడా మైదానంలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాల ప్రవేశాల కోసం జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన 4,5,6 తరగతుల జిల్లా స్థాయి ఎంపికలకు దాదాపు 100 మంది విద్యార్థులు హాజరైనట్టు డీఎస్‌డీవో గౌస్‌బాషా తెలిపారు. వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, ఎత్తు, బరువు వంటివి నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు డీఎస్‌ఎ క్రీడా మైదానంలో మెడిసన్‌ బాల్‌, స్టాడింగ్‌ బ్రాడ్‌ జంప్‌, వర్టికల్‌ జంప్‌, ఫ్లెక్సిబిలిటీ, షటిల్‌ రన్‌, 30 మీటర్స్‌, 800 మీటర్స్‌ రన్‌ వంటి వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. శనివారం 6,7,8,9 తరగతి విద్యార్థులకు ఎంపికలు నిర్వహించనున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో ఇచ్చారు. వారికి కుర్చీలు, మంచి నీటి ఔకర్యం, షామియానాలు వంటివి ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement