కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడప నగర శివారులోని పాలెంపల్లె క్రాస్ వద్ద శుక్రవారం రాత్రి రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మొదట స్విఫ్ట్‌కారు (ఏపి03 బివి 3166)లో గాయపడిన ముగ్గురిని 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతున్న స్విఫ్ట్ కారును తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఎర్టిగా కారు (టిఎస్33సి 0943) ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కారులోని ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎర్టిగా కార్‌లో బెలూన్స్ ఓపెన్ కావడంతో ఆ వాహనంలోని ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మరణించిన వారిలో తిరుపతి జీవకోనకు చెందిన హర్షవర్ధన్, కిషోర్‌తో తోపాటు మరో వ్యక్తి ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి కడప ట్రాఫిక్, చెన్నూరు పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీకి తరలించారు.
ఎర్టిగా కారులో బెలూన్స్ తెరుచుకోవడంతో ముగ్గురికి స్వల్పగాయాలు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యువకులు


